ఒక జలజల పారేనది ఒడ్డున ఉన్న చెట్టుఫై కాకి గూడు కట్టుకుని తన చిన్న చిన్నముగ్గురు పిలల్లతో సoతోసముగా కాలం గడుపుచుండెను. ఒకనాడు కాకి తన పిల్లల మేత కోసం వెళ్లి తిరిగి వచ్చు సమయములో మూడు పిల్లలలో ఒక పిల్ల గూటి నుండి తల బయటికి పెట్టి బయటి ప్రపంచం చుచుచుండెను.
అంతలో తల్లి వచ్చి ఆ పిల్లను కోప్పడి "ఇంకెప్పుడు బయటకి చుడకోడదు.పొరపాటున క్రింద పడవచ్చును, లేక మన శత్రువులు వచ్చి ఎతుకుని వెళ్ళగలరు .మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు" అని ముద్దుగా మందలించెను.
మరోకనటి ఉదయం కాకి మేతకు వెళ్ళినది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆపిల్ల మరల గూటి అంచు వరకు వచ్చి బయటి వింతలను చూచుచున్నది. ఆ సమయాన పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకునిపోయినది.
నీతి:- పెద్దల మాట తప్పక వినవలెను.
No comments:
Post a Comment